కార్గిల్ విజయ్ దివాస్

Kadiri

కార్గిల్ విజయ్ దివాస్

కదిరి లో కార్గిల్ విజయ్ దివాస్ పురస్కరించుకొని ఓబులేశ్వర్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధంలో చనిపోయిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1999 సంవత్సరంలో పాకిస్తాన్ కార్గిల్ భూభాగాన్ని ఆక్రమించి లడాకు వరకు కబ్జా చేయాలన్న వారి వ్యూహాన్ని తిప్పికొడుతూ అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి నేతృత్వంలో కార్గిల్ యుద్ధం జరిగింది అందులో భారతదేశం విజయం సాధించింది ప్రపంచంలోనే ఎత్తైన కొండలపైన మిలిటెంట్ల రూపంలో పాకిస్తాన్ సైన్యం మన దేశ సైనికుల మీద కాల్పులు జరుగుతుంటే అతి కష్టం మీద విరోచితంగా పోరాడి విజయం సాధించిన భారతీయ సైనికులను అనునిత్యం మనం తెలుసుకోవాలి 537 మంది ప్రాణాలు భరతమాత కోసం త్యాగం చేశారు,1300 మందికి పైగా గాయాలపాలయ్యారు పాకిస్తాన్ సైన్యాన్ని ₹4,000 మందినీ పైగా  హతమార్చడం జరిగినది ఇటువంటి గొప్ప వీరులను మనం పూర్తిగా తీసుకొని దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడాలని వీరు చూపిన మార్గం భావి భారత పౌరులకు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలియజేశారు .కార్గిల్లో అసువులు బాసిన భారత సైనికుల నివాళులర్పించడం భారతీయులుగా మనందరి కనీస బాధ్యత అని ఆయన గుర్తు చేశారు దేశ సరిహద్దుల్లో భారత సైన్యం ఉందన్న విశ్వాసంతోనే దేశంలో మనందరం ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నామని అన్నారు 140 కోట్ల మంది భారతీయులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న భారతదేశ సైన్యాన్ని మనందరం రుణపడి ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ చైర్మన్ ఓబులేష్ న్యాయవాది ప్రభాకర్ రెడ్డి హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు